Mahaa Daily Exclusive

  రేపు వైసీపీలోకి శైలజానాథ్…!

Share

మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరనున్నారు. ఇటీవల ఆయన జగన్‌తో భేటీ కాగా చేరికకు వైసీపీ చీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు ఉ.10 గంటలకు తాడేపల్లిలో శైలజానాథ్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. శైలజానాథ్ అనంతపురం జిల్లా శింగనమల నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.