భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు సాధించిన సమగ్ర అభివృద్ధిపై చర్చించి ప్రజల అవసరాలు, పాలకుల ఆలోచన విధానాలపై చర్చించి సరికొత్త పాలన విధానాలు రూపొందించడానికి
వివిధ యూనివర్సిటీ ల వైస్ ఛాన్సలర్ లు, అణగారిన వర్గాల అభివృద్ధికి, హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల వ్యవస్తాపకులు, పాలకులకు, ప్రజలకు అనుసంధానకర్తగా ఉంటున్న మీడియా ప్రముఖులు , విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు అందరినీ ఒక్క వేదికపై కి తీసుకువచ్చి సామరస్య, సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి కొరకు పాలకులకు, ప్రజలకు ఒక దిక్సూచిగా రెడ్డి జాగృతి సదస్సు నిర్వహించింది. సదస్సుకు ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ హరగోపాల్, మంద కృష్ణ తదితర ప్రముఖులు హాజరు కాగా, రెడ్డి జాగృతి అధ్యక్షులు పిట్ట శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి కొట్టం మధుసూదన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నందికొండ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.








