ల్నాడు జిల్లా లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో మొత్తం 25, 30,మంది మహిళా కూలీలు ఉన్నట్లు సమాచారం.
Post Views: 172







