సూర్యపేట జిల్లాలో అమానవీయ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్య చనిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్న ప్రబుత్వ ఉపాధ్యాయుడు ఒకరు ఆమె కూతుళ్ళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన అఘాయిత్యంపై బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదరిస్తూ అప్పుడప్పుడు తన కామ వాంఛలను తీర్చుకున్నాడు. చివరకు సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఎయిడ్స్ సోకడంతో బాలికలిద్దరూ తమపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లితో చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇటీవల ఆ ప్రబుద్ధుడు వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ఈ విషయం తెలిసి బాలికలు ఆందోళన చెంది తల్లికి విషయం చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లికూతుర్లు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు








