Mahaa Daily Exclusive

  కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్య స్నానం…!

Share

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలి’ అని మంత్రి దేవుడిని కోరుకున్నారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయంలో పూజలు చేశారు.