ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం
సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలి
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించిన సీఎం
బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించిన సీఎం
అధికారులు ఇసుక రీచ్ ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించిన సీఎం
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న సీఎం
ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్న ముఖ్యమంత్రి
జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశం
హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించిన సీఎం
ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్ నిఘా ఏర్పాటు చేయాలన్నసీఎం
ప్రతీ ఇసుక రీచ్ ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశం
ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్ లు ఏర్పాటు చేయాలని సూచన
రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలి
ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి
ఏరియాలవారీగా సమీప ఇసుక రీచ్ ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా సిస్టం ఉండాలన్న సీఎం
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలి
సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలి
నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి
ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలన్న సీఎం
ఆన్ లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను సూచించిన సీఎం
ఆఫీస్ టైమింగ్స్ లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలన్న సీఎం
అక్రమరవాణాకు సహకరించే అధికారులపై వేటుతప్పదన్న ముఖ్యమంత్రి
ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన సీఎం
అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానన్న సీఎం
పారదర్శకంగా అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలన్న సీఎం








