Mahaa Daily Exclusive

  చైనాలో కొత్త సంక్షోభం…!

Share

చైనా లో కొత్త సంక్షోభం కలవరపెడుతోంది. ఒక్క చైనాలోనే కాదు.. అది భారత్ లోనూ, ఇతర దేశాల్లోనూ పెరుగుతున్నా చైనా భవిష్యత్తును మాత్రం ఆందోళనల్లో పడేస్తోంది. భారత దేశంలో విడాకుల కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ చెప్పారు. చాలామంది డివోర్స్ పిటిషన్లతోనే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 600 కుటుంబాల్లో కేవలం 4 ఫ్యామిలీల్లోనే డివోర్స్ కేసులు లేవన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోకి వెళ్లిన చైనా.. కొంతకాలంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో కొన్నేళ్లుగా వివాహాలు భారీ స్థాయిలో తగ్గిపోగా, విడాకులు భారీగా నమోదవుతున్నాయి. గతేడాది మొత్తంగా 61లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదుకాగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 20శాతం తగ్గాయి. విడాకుల సంఖ్య పెరగడం చైనాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జనాభా పెరుగుదల కోసం చైనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్కడి యువత మాత్రం వివాహాల వైపు మొగ్గు చూపడం లేదు. చైనా పౌరవ్యవహారాల శాఖ నివేదిక ప్రకారం.. 2024లో దేశవ్యాప్తంగా 61లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 20.5శాతం తగ్గాయి. వివాహాల రిజిస్ట్రేషన్‌ మొదలుపెట్టిన 1986 నుంచి ఈ స్థాయిలో తగ్గడం ఇదే మొదటిసారి. 2013లో 1.3 కోట్ల వివాహాలు నమోదు కాగా.. ప్రస్తుతం ఈ సంఖ్య సగానికంటే తక్కువగా నమోదైంది. చైనాలో విడాకుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. గతేడాది 26లక్షల జంటలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా.. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 28 వేలు అధికం. వీటి సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టిన చైనా ప్రభుత్వం.. విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 30రోజుల ‘కూలింగ్‌-ఆఫ్‌’ వ్యవధిని తప్పనిసరి చేసింది. 2021 నుంచి దీనిని అమలు చేస్తున్నప్పటికీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.
జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనాలో గతేడాది శ్రామిక జనాభా 68.3లక్షలు తగ్గినట్లు తాజా నివేదిక పేర్కొంది. మొత్తం జనాభాలో 60ఏళ్లకుపైగా వయసు కలిగిన వారు 22శాతానికి పెరిగినట్లు తేలింది. మొత్తంగా దేశంలో జనాభా తగ్గుదలకు వివాహల సంఖ్య తగ్గిపోవడమూ ఓ కారణంగా అధికారులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ.. యువత మాత్రం వివాహం, పిల్లల వైపు మొగ్గుచూపడం లేదు. ఒక చైనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ విస్తరిస్తోంది. ఉమ్మడి కుటుంబాలున్న భారతదేశంలోనూ ఇపుడు ఈ ట్రెండ్ మెల్లగా బలపడుతుండడం ఆందోళన కలిగించే పరిణామమే. కొత్త సంక్షోభం నుండి చైనా ఎలా బయటపడుతుందో చూడాలి.