మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి రోజైన ఫిబ్రవరి 14వ తేదీని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జయంతి నిర్వహణకు ఆయన సొంత జిల్లా కర్నూలుకు రూ.3లక్షలు విడుదల చేసింది. అలాగే అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరపడానికి రూ.లక్ష చొప్పున విడుదల చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1960, జనవరి 11 నుంచి 1962, మార్చి 12 వరకు సంజీవయ్య ఉమ్మడి ఏపీకి రెండో సీఎంగా సేవలు అందించారు
Post Views: 135







