Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్‌తో మందకృష్ణ మాదిగ భేటీ…!

Share

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎమ్మార్పీఎస్‌ నేతలతో కలిసి సీఎంతో ఆయన సమావేశమయ్యారు. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికలోని లోపాలను సీఎం రేవంత్‌ దృష్టికి మందకృష్ణ తీసుకెళ్లనున్నారు. ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్లపై సీఎంతో చర్చించనున్నారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు.