Mahaa Daily Exclusive

  రంగరాజన్‌ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు…!

Share

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆయనతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ. హనుమంతరావు ఉన్నారు. దాడి ఘటనను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దేవుని పేరుమీద దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నిందితుల్లో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని, ఆలయం వద్ద భద్రత పెంచుతామని మంత్రి స్పష్టం చేశారు.