రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై పార్టీ శ్రేణులకు సమగ్ర అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో రేపు ఈ రెండు అంశాలపై గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.
Post Views: 92







