Mahaa Daily Exclusive

  రహదారి భద్రత నియమాలు పాటించాలి – జిల్లా రవాణా శాఖధికారి టి. దుర్గాప్రసాద రెడ్డి

Share

రహదారి భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా శాఖధికారి టి. దుర్గాప్రసాద రెడ్డి అన్నారు. రహదారి భద్రతా మహోత్సవాలు లో భాగంగా చినమేరంగి పోలీస్ స్టేషన్ జంక్షన్ లో రహదారి ప్రమాదాల పై ఆటో డ్రైవర్లకు, తిరుమల సాయి స్కూల్ యాజమాన్యం కు, వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నియమాలును పాటించాలని సూచించారు. రహదారి భద్రత నియమాలను పాటించకపోతే వాటి వలన జరిగే రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వారితో రహదారి భద్రత నియమాలను పాటిస్తామని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేస్తామని ఆటో యూనియన్స్ తో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందన్నారు. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని ద్విచక్ర వాహనాన్ని నడిపే వ్యక్తి తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలి అన్నారు. అతివేగంగా వాహనాన్ని నడపరాదని, ద్విచక్ర వాహనంపై త్రిపుల్ రైడింగ్ చేయకూడదని, మద్యం సేవించి, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాన్ని నడపరాదని సూచించడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన మైనర్లు వాహనాన్ని నడపరాదని, తల్లిదండ్రులు వారికి వాహనాలను ఇవ్వకూడదని, కార్ డ్రైవింగ్ చేసేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరంమని, పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించరాదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎం.వి ఇన్స్పెక్టర్ జి. సత్యనారాయణ, సహాయ ఇంధన శకట తనిఖీ దారులు ఎన్.రమేష్ కుమార్, ఎఎస్ఐ కాసలు, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పాల్గొన్నారు.