Mahaa Daily Exclusive

  17న కుంభమేళాకు మంత్రి లోకేశ్…!

Share

ఈ నెల 17న మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లనున్నారు. అక్కడ వారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అదే రోజు సాయంత్రం లోకేశ్ దంపతులు వారణాసికి చేరుకుంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా, ఈ నెల 26 వరకు మహా కుంభమేళా కొనసాగనుంది.