Mahaa Daily Exclusive

  రేపు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన…..!

Share

‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా CM చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11.45కు ఆయన కందుకూరు TRR కాలేజీలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు దూబగుంట శివారులోని వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.