ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. భారత దేశంలో ఆసేతు హిమాచలం మోడీని విశ్వసించని ప్రేమించని వారు లేరన్నారు. పేదరికం నుండి వచ్చిన వాడిని.. పేదల బాధలు అన్నీ తెలుసు అందులో PhD చేసాను అని ఆయన అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని మోదీ అమలు చేస్తున్నారన్నారు.
అప్పుడు కేసీఆర్ కూడా కళ్ళు నెత్తికి ఎక్కి మోడీ గీడీ అని మాట్లాడారనీ, ఇప్పుడు రేవంత్ డిల్లీకి పోయి మోడీని మా పెద్దన్న అంటాడు. కేంద్ర సాహకారం కావాలని అంటారు. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని విరుచుకు పడ్డారు.
మోడీ బీసీ కాదు అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి పోయేకాలమా? అని అన్నారు.
మోడీ కులాలకు అతీతం.
భారత జాతి ఆత్మగౌరవం ప్రపంచ పటం మీద నిలబెడుతున్న వ్యక్తి.
అమెరికన్ ప్రెసిడెంట్ కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు.
రేవంత్ కూట్లో రాయి తీయలేనివాడు.
ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు ఉందన్నారు.మోడీ మీద విమర్శలు సూర్యుని మీద ఉమ్మి వేసినట్టు ఉన్నాయన్నారు.
మోడీకి స్వార్థం లేదు దేశ ప్రజలే ఆయన కుటుంబం ఆయన మీద విమర్శ చేస్తే ప్రజలు గతంలో వారికి చెప్పిన బుద్దే మీకు చెప్తారన్నారు.
మోడీతో గొక్కోవడం అంటే ధర్మంతో, ప్రజలతో గోకోవడమే.
ఆ నిమిషానికి చప్పట్లు కొట్టొచ్చు కానీ తరువాత పర్యవసానాలు కేసీఆర్ కి అర్ధం అయ్యాయి మీకు కూడా అర్ధం అవుతాయి.
పెద్దలను గౌరవించడం నేర్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నానని అన్నారు.







