తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి లోకేశ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తెలుగుదేశం నాయకులను గత ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బందిపెట్టిన వారిపట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లారని పేర్కొన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్న ఆయన.. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Post Views: 61







