సీఎం స్థాయిలో ఉండి ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. అటు మండల్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని, బీజేపీ వచ్చాకే అమలుపర్చిందని తెలిపారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
Post Views: 54







