ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్’ కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. మనం తినే తిండి, పీల్చే గాలి కలుషితం అవుతోందని, కలుషిత ఆహారంతో క్యాన్సర్లతో పాటు పలు రకాల సమస్యలు వస్తున్నాయని CM తెలిపారు. అందుకని స్వచ్ఛాంధ్రలో భాగం కావాలని అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని CM స్పష్టం చేశారు.
Post Views: 60







