మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను TTD ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్లైనలో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10గంటల వరకు భక్తులు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాటి చెల్లింపులను ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. మే నెల గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
Post Views: 47







