ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100 శాతం, ఇతర అన్ని వర్గాల సన్న, చిన్నకారు రైతులకు 90శాతం రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు అందజేయాలని నిర్ణయించింది. రాష్ట్రీయ కృషి వికాస యోజన (RKVY)లో భాగంగా గరిష్ఠంగా అయిదెకరాల వరకు.. రూ.2.18 లక్షలు మించకుండా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
Post Views: 53







