సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం పోలీసు విభాగం దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబద్ హెచ్ఐసీసీలో మంగళవారం నిర్వహించిన ‘షీల్డ్ 2025’ సదస్సులో ఆయన మాట్లాడారు. “మా పోలీసు అధికారులు ప్రత్యేకంగా శ్రమించి.. నిరంతర కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఈరోజు దేశంలోనే సైబర్ నేరాలను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడింది.” అని సీఎం వ్యాఖ్యానించారు.
Post Views: 141







