కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజూ కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా.. మంగళవారం కేవలం 10 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నిక మరోసారి వాయిదా పడింది.
Post Views: 114







