Mahaa Daily Exclusive

  రాజాసింగ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తొలగింపు…!

Share

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చెందిన 2 ఫేస్‌బుక్ పేజీలు, 3 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మెటా దాని మాతృ సంస్థలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగిండంపై ఆయన Xలో స్పందించారు. ‘హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలక్టివ్ సెన్సార్‌షిప్ దాడి చేస్తోంది. గురువారం నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేయడం దురదృష్టకరం’ అని తెలిపారు.