ఎస్ ఎల్ బిసి సొరంగంలో ప్రమాదం దురదృష్టకరమని, ఘటన జరిగిన రెండు మూడు గంటల్లోనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి సమీక్ష నిర్వహించగా, ఘటనాస్థలి నుండి వచ్చిన మంత్రి ఉత్తమ్, అధికారులు సీఎంకు తాజా పరిస్థితి నివేదించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటి అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్సెల్బీసీ సొరంగంలో ప్రమాదం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తంచేశారు. ఉదయం 8.30 నుంచి 9 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని.. హుటాహుటిన 11గంటలకల్లా అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకున్నారు. ఇందులో ఇండియన్, అమెరికన్ కంపెనీకి చెందిన వారు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బందిని సమన్వయం చేసుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నం. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్పెషల్ టాస్క్ ఫోర్స్, అత్యాధునిక మెషినరీ సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలోని డీవాటరింగ్, డీసిల్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఘటన జరగడం దురద్రుష్టకరం. సొరంగంలో చిక్కుకున్న వారిలో ఇద్దరు జేపీ అసోసియేట్స్ కంపెనీ ఇంజనీర్లు, నలుగురు జార్కండ్ కు చెందిన కూలీలు, మరో ఇద్దరు అమెరికన్ కంపెనీ రాబింగ్ కంపెనీ ఉద్యోగులు,
ప్రపంచంలోనే రాబింగ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, వివిధ దేశాల్లో 3వేల కిలోమీటర్లకు పైగా టన్నెల్స్ తయారు చేసిన కంపెనీ. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడుతాం. అవాంతరాలను అధిగమించి సొరంగాన్ని పూర్తి చేస్తాం . ఈ సొరంగం పూర్తయితే 3 నుంచి 4లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పటికే 33.5కి.మీ పనులు పూర్తయ్యాయి. మరో 9.5 కి.మీ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అనుకోకుండా జరిగిన దురద్రుష్ట కర ఘటన ఇది. దీనిపై బీఆరెస్ అబద్దపు ప్రచారం చేస్తోంది. గతంలోనూ బీఆరెస్ హయాంలో లీకేజీలు జరిగాయి. గతంలో డీవాటరింగ్ కు వాళ్లు రూ. 29 కోట్లు ఇచ్చారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ స్టేషన్ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోతే వాళ్లు అక్కడికి వెళ్లిన పాపాన పోలేదు. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారెని వెళ్లకుండా అరెస్టు చేశారు. కానీ ఘటన జరిగిన రెండు మూడు గంటల్లోనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాం. అవాంతరాలన్నీ అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళతాం అని మంత్రి ఉత్తమ్ స్పఫ్టం చేశారు.







