Mahaa Daily Exclusive

  రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా – మాజీ మంత్రి ఆర్ కే రోజా

Share

ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్ కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు ఆర్ కే రోజా. సోమవారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్ కే రోజా.. ఎవరికైనా మేలు చేయాలంటే అది వైఎస్ జగన్ కే సాధ్యమన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అడుగుతుంటే, దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ సెటైర్లు వేశారు రోజా. ఒకవేళ పవన్ కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు