Mahaa Daily Exclusive

  శివన్నామస్మరణతో మార్మోగిన ఆలయాలు శివాలయంలో మంత్రి ఉత్తమ్ దంపతులు ప్రత్యేక పూజలు…!

Share

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజక వర్గం మేళ్లచెరువు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,పద్మావతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఇట్టి కార్యక్రమంలో మంత్రి ఉత్తమ మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంకు ప్రభుత్వం నుండి కోటి రూపాయల నిధులను ఇవ్వడం జరిగిందని రానున్న రోజుల్లో దేవాలయాన్ని మరియు మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తానని సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని శివయ్య ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని వారిని చల్లగా దీవించాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే కోదాడ వేనేపల్లి చందర్రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు భక్తులు పాల్గొన్నారు.