కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి అడ్డుపడడం వల్లే మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ ప్రాజెక్టులు ఆగిపోయాయని ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్లో పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్ రెడ్డి వంద శాతం సైంధవ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కేందం బీహార్, యూపీకి ఇస్తున్న ప్రాధాన్యం తెలంగాణకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
Post Views: 94








