Mahaa Daily Exclusive

  5 నుంచే తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు…!

Share

తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ కోసం ఇంటర్‌ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. తొలుత కళాశాలల లాగిన్‌లలో ఉంచిన అధికారులు.. తాజాగా ప్రథమ, ద్వితీయ ఇంటర్‌తో పాటు బ్రిడ్జి కోర్సు పరీక్షల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌/ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మార్చి 5న ప్రారంభం కానున్న ప్రథమ ఇంటర్‌ పరీక్షలు 24తో ముగియనున్నాయి. అలాగే, మార్చి 6 నుంచి మొదలయ్యే ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు 25వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాసే అవకాశం ఉంది.