Mahaa Daily Exclusive

  తెలంగాణా ఇంచార్జి,జిల్లా ఇంచార్జి మంత్రితో కంది శ్రీ‌నివాస రెడ్డి…!

Share

ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్,గ్రామీణాభివృద్ధి,స్త్రీ శిశుసంక్షేమశాఖా మంత్రి సీత‌క్క‌తో క‌లిసి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్ ను క‌లిసారు.మ‌హారాష్ట్ర వార్ధా లోని సేవాగ్రామ్ లో జ‌రిగిన ముఖ్య స‌మావేశానికి వారు హాజ‌ర‌య్యారు. తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి మ‌రింత‌ బ‌లోపేతం చేయాల‌ని తెలంగాణ ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్ నేత‌ల‌కు సూచించిన‌ట్టు తెలుస్తోంది. ఇటు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి పార్టీని మ‌రింత ప‌టిష్ట‌స్థితికి చేర్చేలా కృషి చేస్తాన‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి నేత‌ల‌కు చెప్పిన‌ట్టు తెలిపారు.