Mahaa Daily Exclusive

  7న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన: మహేశ్ కుమార్

Share

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ క్రమంలో అభ్యర్థులను ఈ నెల 7న ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతంపై శ్రేణులకు ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ మల్లన్న తమ పార్టీలో లేరని.. అలాంటి వ్యక్తుల గురించి తాను మాట్లాడబోనని పేర్కొన్నారు.