తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ స్కూళ్లతోపాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే నిర్వహించనున్నారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.
Post Views: 175








