సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగనుంది. డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాటు లోక్సభ ఎంపీలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్ర రుణ భారం తగ్గించుకోవడం, కేంద్రం నుంచి పన్నుల వాటా పెంపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్పై చర్చించనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
Post Views: 67








