Mahaa Daily Exclusive

  సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

Share

టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి 6.15లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు.