Mahaa Daily Exclusive

  ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ అఖిలక్షానికి అపాయింట్ మెంట్ ఇవ్వండి..!

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లేఖలో కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42శాతానికి పెంచాలని సోమవారం రెండు బిల్లులను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు.