Mahaa Daily Exclusive

  8 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన తెలంగాణ బీజేపీ..!

Share

తెలంగాణ బీజేపీ రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం బీజేపి పార్టీ స్టేట్ ఎలక్షన్ కో-రిటర్నింగ్ ఆఫీసర్ గీతా మూర్తి జాబితా విడుదల చేశారు. ప్రస్తుత 8 మంది జిల్లాల అధ్యక్షుల ప్రకటనతో ఇప్పటివరకు ప్రకటించిన జిల్లాల సంఖ్య 36కు చేరుకుంది. మరో రెండు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించాల్సి ఉంది.

జిల్లా అధ్యక్షుడి పేరు

రంగారెడ్డి అర్బన్ – వానిపల్లి శ్రీనివాసరెడ్డి

రంగారెడ్డి రూరల్ – పంతగి రాజ్ భూపాల్ గౌడ్

వికారాబాద్ – కొప్పు రాజేశ్వర్ రెడ్డి

నాగర్ కర్నూల్ – వేముల నరేందర్ రావు

జోగులాంబ గద్వాల్ – టీ. రామాంజనేయులు

ఖమ్మం – నెల్లూరి కోటేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

భాగ్యనగర్ మలక్ పేట్ – వై. నిరంజన్ యాదవ్