Mahaa Daily Exclusive

  జానారెడ్డి- కేటీఆర్ మధ్య ఆత్మీయ సంభాషణ..!

Share

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో సోమవారం రాత్రి ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభ వాయిదా అనంతరం సభ నుంచి బయటికి వచ్చిన బీఆర్ఎస్ నేత కేటీఆర్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ‘హలో అంకుల్’ అంటూ పలకరించారు. కాసేపు వారి ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. ‘ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్’ అని కేటీఆర్ అడగగా.. ‘నా ఆరోగ్యం బాగుంది.. నా ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా’ అని జానారెడ్డి అడిగారు. దీనికి ’70 పైనే ఉండవచ్చు’ అని కేటీఆర్ అనగా.. ’79 ఏళ్లు పూర్తయ్యాయి’ అని జానారెడ్డి అనడంతో వారిమధ్య నవ్వులు విరిసాయి. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇస్తున్నారని జానారెడ్డి ని కేటీఆర్ అన్నారు. అనంతరం మా జానారెడ్డితో ఫోటో దిగుతాను అని.. ఇరువురు ఫోటో దిగి అక్కడి నుంచి వీడ్కోలు పలికారు. ఈ ఫొటో, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం కోసం జానారెడ్డి అసెంబ్లీకి వచ్చారు