Mahaa Daily Exclusive

  టీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ బీసీ బిల్లు చట్టబద్దతకు ఢిల్లీలో చేసే ధర్నాకు మద్దతుఇవ్వాలని వినతి..!

Share

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, మాజీ మంత్రి టి.హరీష్ రావులను కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్, హరీష్ రావులను కలిసి.. బీసీల వివరాలతో కూడిన వినతీపత్రంను అందజేశారు. అదే విధంగా.. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని తీన్మార్ మల్లన్న కోరారు. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లు కూడా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే..ఒంటి కాలి మీద నిలబడే తీన్మార్ మల్లన్న .. తాజాగా.. బీఆర్ఎస్ నేతల్ని కలడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హట్ టాపిక్ గా మారింది.