బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేదని, ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆరోపించారు. పరీక్ష పూర్తికాకముందే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో వచ్చిందని, సంస్కృతం ప్రశ్నాపత్రానికి బదులుగా తెలుగు ప్రశ్నాపత్రం ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Post Views: 35








