Mahaa Daily Exclusive

  పీ-4 విధానం.. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి: సీఎం చంద్రబాబు

Share

సంపన్నులు-పేదలను ఒకే చోటకు చేర్చడమే లక్ష్యంగా పీ-4 విధానాన్ని రూపొందించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తెలిపారు. ఉగాది పండుగ రోజు అమరావతిలో పీ-4 విధానాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చెప్పారు.  పీ4 అమల్లో భాగంగా.. తొలుత గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిపొందే కుటుంబాల జాబితా రూపొందిస్తారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందన్నారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలనేదే తమ లక్ష్యమని అన్నారు.