అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మేము అనలేమా? రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలు మేము అనలేమా? అంటూ ప్రశ్నించారు. 20% కమీషన్లు అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలి కేటీఆర్ డిమాండ్ చేశారు.
Post Views: 228








