Mahaa Daily Exclusive

  ఆ 400 ఎకరాలు అమ్మడమే సర్కారు లక్ష్యం అర్ధరాత్రి యంత్రాలు వినియోగిస్తున్నారు ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..!

Share

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ తో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో హెచ్ సియు భూముల ఇష్యూపై విద్యార్థులతో కేటీఆర్ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం 400 ఎకరాలు అమ్మి.. రూ.30 వేల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ పండుగ వేళ కోర్టుకు సెలవులు అని.. అందుకే అర్ధరాత్రి మెషీన్లు, వందల సంఖ్యలో పోలీసులను పంపి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నదని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీలో 45 వేల ఎకరాలు ఉండగా.. ఈ 400 ఎకరాల మీద ఎందుకు అంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.