టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు బ్లాక్ బెల్ట్ ప్రధానోత్సవం జరిగింది. ఓ వైపు అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర చీఫ్ గా ఉంటూ, అటు ప్రభుత్వ నిర్లయాల పరిణామాల సమన్వయం, ఇటు క్యాడర్..నేతల నుండి ఎదురయ్యే సవాళ్ళను చాకచక్యంగా పరిష్కరిస్తూనూ తనలోని కరాటే మాస్టర్ ను కొనసాగించిన మహేష్ కుమార్ గౌడ్ కరాటే అంటే తనకు ఎంత ప్రాణమో చాటిచెప్పాడు. సోమవారం వెస్ట్ మారేడుపల్లి లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి బ్లాక్ బెల్ట్ సెవెంత్ డెన్ ( షిచిదాన్ ) ను గ్రాండ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్ ప్రధానం చేశారు. మాస్టర్స్ సంపత్ కుమార్, వసంత కుమార్, మొండయ్య కి బ్లాక్ బెల్ట్ 8వ డెన్ ఈ సందర్భంగా ప్రధానం చేశారు. కరాటే తన జీవితంలో భాగమని ప్రకటించిన మహేష్ కుమార్ గౌడ్ తాజాగా నిర్వహించిన జాతీయపోటీలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
Post Views: 167








