వివాదాస్పదంగా మారిన గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. భూములను విక్రయించి ఖజానాకు కాసులను సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే ఎట్టి పరిస్థితులలో విక్రయించేందుకు వీలులేదని, భూముల విక్రయం ద్వారా పర్యావరణం దెబ్బతినడంతో పాటు హెచ్ సీయూ కు భారీ నష్టం వాటిల్లుతుందని బీజేపీ, బీఆర్ఎస్ లు పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ తదితరులు కలిసి తెలంగాణలో జరుగుతున్న భూముల రగడపై వివరించారు.
జోక్యం చేసుకోవాలని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని విన్నవించారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రాషఅట్ర బీజేపీ ఎంపీలు, మంత్రులు వివరించారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని వివరించారు. ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని పేర్కొన్నారు. హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు.








