Mahaa Daily Exclusive

  ఈ బిల్లు లేకపోతే.. పార్లమెంట్ భూమినీ వక్ఫ్ ఆస్తి అంటారు: రిజిజు విమర్శలు

Share

ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్‌ ఆస్తిగా చెబుతారని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ‘బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి. అందులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. 1954లో తొలిసారి వక్ఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఎవరూ చెప్పలేదు. పార్లమెంట్ ఉభయ సభ్యులతో కూడిన జేపీసీకి అభినందనలు. మొత్తం 284 ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు జేపీసీలో తమ వాదనలు వినిపించాయి. మేం బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తే.. మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లు తీసుకురాకపోతే.. కొందరు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్‌ ఆస్తిగా పేర్కొంటారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.