ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అనుమతి లభించడం హర్షదాయకమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించి మరీ అనుమతులు సాధించారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. వాయుసేనకు అనుమతులు లభించాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న నిరంతర శ్రమకు ఈ ఫలితం నిదర్శనమన్నారు. ఆదిలాబాద్ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 134








