Mahaa Daily Exclusive

  గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ సుప్రీంకోర్టు కీలక తీర్పు…!

Share

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టేందుకు టీజీపీఎస్సీ సన్నాహకాలు మొదలుపెట్టింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం 2024 ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్, 2024లో ప్రిలిమినరీ పరీక్ష జరగగా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు 2024, మార్చి 10న ప్రకటించారు. మార్చి 30న జనరల్ ర్యాంక్స్ విడుదల చేశారు. కానీ ఈ నోటిఫికేషన్ లో జీవో నెం. 29 ద్వారా తమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వారి పిటిషన్‌ను కొట్టివేసింది. బలమైన వాదనలు లేవని తోచిపుచ్చింది.