బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై ICMR బృందంతో సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బాలిక మృతికి గల కారణాలను చర్చించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు.. బంధువులు, స్థానికుల నమూనాలు పరీక్షించామని.. ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి కేసులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
Post Views: 165








