వాడీవేడి చర్చలతో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఈ కొత్త చట్టాన్ని కాంగ్రెస్, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఈ కొత్త చట్టం వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం, ఆక్రమణలు ఆపడానికి ప్రయత్నిస్తుందని ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఈ చట్టం ముస్లింలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నముస్లింలలో ఈ చట్టంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
……….
Post Views: 124








