: కృష్ణా, గోదావరి జలాలపై విచారణకు బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట స్వయంగా హాజరవుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై న్యాయవాదులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ ఆదివారం చర్చలు జరిపారు. కృష్ణా జలాల వివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందంతో చర్చించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరగనున్న విచారణ అంశాలపై ఆరా తీశారు. వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందానికి పూర్తి సహకారం ఇస్తామన్న ఆయన వక్రీకృత నీటి కేటాయింపుల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసమతుల్యతను సరిదిద్దడానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు.
Post Views: 96








