Mahaa Daily Exclusive

  హెచ్ సీయూ భూముల వివాదం కృత్రిమ మేథతో వీడియోలు సృష్టించి ప్రచారం చేశారు హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం ..!

Share

హెచ్ సీయూ భూ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కృత్రిమమేధ సాయంతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏప్రిల్‌ 24న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. 400 ఎకరాల భూ వివాదంలో నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌ తయారు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు ఫేక్ ఫొటో, వీడియోలు క్రియేట్ చేశారని పిటిషన్ లో వివరించారు. ఇటీవలే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలీసు అధికారులు ఏఐ టెక్నాలజీతో కృత్రిమ వీడియోల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేసినట్లు తెలిపారు. దీంతో న్యాయపరంగా ముందుకు వెళ్ళాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే.